![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -341 లో.....శకుంతల షాపింగ్ కి వస్తుంది. అక్కడ సుధా కలిసి మాట్లాడుతుంది. పెళ్లికి ఒప్పుకున్నందుకు థాంక్స్ అని అంటుంది. నేను ఒప్పుకోలేదు.. ఎదురుతిరగలేక సైలెంట్ గా ఉన్నాను అంతే.. అసలు నిన్ను ఈ జన్మలో క్షమించనని శకుంతల చెప్పేసి వెళ్ళిపోతుంది. మరొకవైపు రామనాథాన్ని వీరు చంపాలనుకుంటాడు. అప్పుడే రామనాథం తప్పించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రామనాథం గురించి రుద్ర వాళ్ళు బయట వెయిట్ చేస్తారు. అక్కడ ఒకతను రామనాథం టెన్షన్ గా వెళ్లడం చూసానని చెప్పగానే రుద్ర వాళ్ళు వెళ్తారు.
రుద్ర వాళ్ళు రోడ్డుపై పరిగెడుతుంటే శకుంతల చూస్తుంది. వాళ్లకి ఎదురుగా వెళ్తుంది. అసలు ఏంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఎవరితో గొడవకి వెళ్తున్నారు.. మళ్ళీ ఎవరిని చంపాలని చూస్తున్నావని రుద్రని అంటుంది. ఏంటి అమ్మ మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గంగ అనగానే నువ్వు నోరు ముయ్ ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం అనగానే గంగ షాక్ అవుతుంది.
మరొకవైపు ఇంట్లో అందరు పెళ్లి షాపింగ్ కి సంబంధించిన హడావిడి చేస్తుంటారు. గంగ, రుద్ర ఎక్కడ అని పెద్దసారు అడుగుతాడు. ఏమో ఎప్పుడు వెళ్తారో.. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏం తెలియడం లేదు.. అంతా మేమే చూసుకుంటున్నామని బిల్డప్ ఇస్తారని ఇషిక, సూర్య అనగానే సూర్యపై పెద్దసారు కోప్పడతాడు. ఆ తర్వాత వీరు కార్ తో రామనాథాన్ని ఆక్సిడెంట్ చేస్తాడు. అప్పుడే శకుంతల అక్కడికి వస్తుంది. తనని చూసి రామనాథం నిజం చెప్తాడు. విశ్వకూతురు జయ కాదు గంగ అని చెప్పగానే శకుంతల షాక్ అవుతుంది. నిజం చెప్పాక రామనాథం చనిపోతాడు. శకుంతల అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రుద్ర వాళ్ళు వస్తారు. అక్కడున్న వాళ్లంతా ఒక మేడమ్ కి ఏదో చెప్పి చనిపోయాడని చెప్తారు. ఎవరు వాళ్ళు అని రుద్ర అడుగుతాడు. అటుగా వెళ్తున్న కార్ వంక వాళ్ళు చూపిస్తారు. అది శకుంతల బాప కార్ అని రంగా అంటాడు. అంటే అమ్మగారికి ఏదో చెప్పాడు అన్నమాట అని గంగ అంటుంది. తరువాయి భాగంలో శకుంతల ఇంటికి వచ్చి టెన్షన్ పడుతుంది ఏదో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |